![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -721 లో...... కళ్యాణ్ అప్పు, ఇందిరాదేవి, స్వప్న అపర్ణ అందరు కలిసి రాజ్ కావ్య వెంటపడేలా చెయ్యాలని ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా రాజ్ ని కలవాలని కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. రాజ్ ఒప్పుకుంటాడు. సీన్ కట్ చేస్తే అందరు రాజ్ దగ్గరికి వస్తారు. అపర్ణ మాట్లాడుతుంటే మిమ్మల్ని అమ్మ అనుకుని కేక్ కట్ చేయించాను కానీ మీరు నన్ను మోసం చేసారని రాజ్ అంటాడు. అంటే కావ్య నా గురించి నీకు చెప్పలేదు ఏం అలోచించి చెప్పలేదో నాకు తెలియదు కదా అందుకే సైలెంట్ గా ఉన్నానని అపర్ణ అంటుంది.
అయిన మా కావ్య మోసం చేయలేదు నిజం దాచి అబద్ధం చెప్పింది అంతే మోసం చెయ్యలేదని ఇందిరాదేవి అంటుంది. కావ్య నిన్ను ఇష్టపడుతుంది అందుకే నీ వెంటపడింది.. నీకు క్యారేజ్ పంపింది.. షర్ట్ గిఫ్ట్ పంపిందని అందరు కావ్య గురించి చెప్పగానే రాజ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. నిజంగానే కళావతి గారు నన్ను ప్రేమిస్తున్నారా అని అంటాడు. కానీ నీకు యామినితో పెళ్లి కదా అని అపర్ణ అడుగుతుంది. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు కళావతి గారి మనసులో ఏముందో తెలుసుకుని ఆ విషయం యామినికి చెప్పాలని చూస్తున్న అని రాజ్ అంటాడు. కళావతి తనంతటా తానే బయటపడేలా చెయ్యాలని అందరు రాజ్ కి చెప్తారు. దానికి రాజ్ సంతోషంగా ఒప్పుకుంటాడు.
ఆ తర్వాత రాజ్ ని ఇంటికి తీసుకొని వెళ్లి భోజనం వడ్డీస్తారు. రాజ్ ఆలా సంతోషంగా ఉంటే సుభాష్, ప్రకాష్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే పై నుండి కావ్య కిందకి వస్తుంది. మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చారని కావ్య అనగానే.. సరే వెళ్తాను కానీ మళ్ళీ రేపు వస్తాను వస్తునే ఉంటానని రాజ్ అంటాడు. అదంతా చూసి రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |